September 12, 2026
Explore
జాతీయ లోక్‌ అదాలత్‌లో 252 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో 252 కేసులు పరిష్కారం

September 12, 2026 | Andhra Pradesh

  • రూ.1.41 కోట్ల పరిహారం పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

స్థానిక కోర్టు ఆవరణంలో జరిగిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో 252 కేసులు పరిష్కరించి, రూ.1.41 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు పంపిణీ చేశారు. శనివారం లోక్‌అదాలత్‌ను సీనియర్‌ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్‌, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కృష్ణవంశి ల ఆధ్వర్యంలో లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ లోక్‌అదాలత్‌లో 47 సివిల్‌ కేసులు, 205 క్రిమినల్‌ కేసులు , తదితర వెహోత్తం 252 కేసులు పరిష్కరించారు. ఈ సంసర్భంగా న్యాయమూర్తి ఆరీఫాషేక్‌ మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులతో పాటు పరిహారాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. న్యాయవాదులు , అధికారులు, కక్షిదారుల సహాకారంతో మెగా లోక్‌అదాలత్‌ జయప్రదమైందన్నారు. ఈ సహకారాన్ని ఇలాగే అందిస్తూ , పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ఏజిపి సురేష్‌బాబుతో పాటు న్యాయవాదులు , కక్షిదారులు పాల్గొన్నారు.

Tags: 252 cases resolved at the National Lok Adalat.