April 29, 2026
Explore
కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మానం

కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మానం

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మాన కార్యక్రమాన్ని బుధవారం మండలంలోని అడవినాథునికుంటలో పరివర్తన వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు అంబేద్కర్‌, గాంధిజి చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేశారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ కులాంతర వివాహాల ద్వారా కులతత్వాన్ని తగ్గించేందుకు వీలుందన్నారు. అలాగే దంపతులకు ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని, అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటుకు నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్‌ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, బహుజనసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, మోడల్‌స్కూల్‌ చైర్మన్‌ సదాశివరెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి శ్రీరాములుతో పాటు కులాంతర వివాహాలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Honoring Those Who Entered into Inter-caste Marriages