చిలకలూరిపేట ముచ్చట్లు:
పెట్రోల్, డీజిల్ విషయంలో వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు తహశీల్దార్ హుస్సేన్ సూచించారు. బుధవారం చిలకలూరిపేట లోని భారత్ పెట్రోల్ బంకును ఆయన తనిఖీ చేపట్టారు. బంకులోని ఆయిల్ కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. స్టాక్ ఎప్పుడు తెప్పించారు.. ఎంత ఉన్నది.. ఎంత అయిపోయిందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Tags: Chilakaluripet Tahsildar inspects oil tank