April 29, 2026
Explore
బ్యాంకుల పనితీరుపై దుమెత్తపోసిన నెటిజన్లు…

బ్యాంకుల పనితీరుపై దుమెత్తపోసిన నెటిజన్లు…

April 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సోదరి అస్థిపంజరంతో బ్యాంకు వెళ్ళిన గిరిజనుడికి డబ్బు చెల్లించిన బ్యాంకు సిబ్బంది…. సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా చర్చ…. బ్యాంకుల పనితీరుపై దుమెత్తపోసిన నెటిజన్లు….

బ్యాంకింగ్ వ్యవస్థనే దుమ్మెత్తి పోవడంతో ఎట్టకేలకు బ్యాంకు అధికారులు ఒరిస్సాకు చెందిన అమాయక గిరిజనుడుకు డబ్బులు చెల్లించారు.
తన చెల్లెలు, ఆమె భర్త చనిపోవడంతో ఆమె ఖాతాకు నామినీగా ఉన్న జీతూ అనే గిరిజనుడును బ్యాంక్ సిబ్బంది ముప్పతిప్పలు పెట్టారు.
చివరకు ఆమె రావాల్సిందేనని చెప్పడంతో, రెండు నెలల కింద చనిపోయిన చెల్లెలు సమాధి తవ్వి, మూడు మైళ్ళ దూరం నడిచి ప్లాస్టిక్ బ్యాగులో శవం తీసుకొచ్చాడు.
దీంతో దేశమంతా బ్యాంకు అధికారులను దుమ్మెత్తి పోసింది.
లక్షల కోట్లు ఎగవేసే వారికి ఎర్ర తివాచీలు పరిచి, పాదసేవ చేసే వ్యవస్థ పేద, అమాయక, ఆటవిక గిరిజనుడుకి చెల్లించాల్సిన 19 వేల రూపాయలకు ఇంత రాద్దాంతం ఎందుకని విమర్శలు వెల్లువెత్తడంతో చివరకు డబ్బులు చెల్లించారు..

Tags: Netizens lash out at banks’ performance.