April 29, 2026
Explore
“మీ భద్రత – మా బాధ్యత”

“మీ భద్రత – మా బాధ్యత”

April 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఒబులవారిపల్లిలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
  • సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్, కుటుంబ సమస్యలపై అవగాహన.
  • అత్యవసర సేవల నెంబర్లు, శక్తి యాప్‌పై పోలీసుల సూచనలు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, “మీ భద్రత – మా బాధ్యత” అనే థీమ్‌తో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం ఈ రోజు ఒబులవారి పల్లిలో నిర్వహించడం జరిగింది.
  • ఈ కార్యక్రమాన్ని ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వారు జీఎంఎస్‌కే సభ్యులతో కలిసి సమన్వయంతో నిర్వహించగా, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఒబులవారిపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.
  • ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు రూరల్ సీఐ, ఒబులవారిపల్లి తహసీల్దార్, ఎంపీడీఓ, ఒబులవారిపల్లి ఎస్ఐ మరియు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు హాజరయ్యారు.
  • అవగాహన కార్యక్రమంలో భాగంగా మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలు, అలాగే పెరుగుతున్న కుటుంబ వివాదాలు, దాంపత్య సమస్యల కారణంగా కుటుంబ విభజన వంటి అంశాలపై అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. కుటుంబ విలువలను కాపాడుకోవడం, గృహ సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం, పిల్లలకు మంచి అలవాట్లు మరియు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు.
  • అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం వెంటనే డయల్ 100 లేదా 112కు కాల్ చేయాలని మహిళలకు సూచించారు. అలాగే శక్తి యాప్ వినియోగం, దాని ద్వారా అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు.

Tags: Your Safety – Our Responsibility