April 29, 2026
Explore
మహిళా ఉద్యోగులకు అవగాహన

మహిళా ఉద్యోగులకు అవగాహన

April 29, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • మంబట్టు SEZ, కొండూరు ప్రాంతాల్లో మహిళా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు.
  • సుమారు 520 మంది మహిళా ఉద్యోగులకు శక్తి యాప్, లైంగిక వేధింపులు, సైబర్ మోసాలపై అవగాహన.
  • అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని సూచనలు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ఈ రోజు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు మంబట్టు SEZలోని భారతీ కంపెనీ మరియు కొండూరులోని VKC ఫుట్వేర్ కంపెనీలలో పోలీస్ అధికారులు నిర్వహించారు. మంబట్టు SEZలోని భారతీ కంపెనీలో సుమారు 400 మంది మహిళా ఉద్యోగులు, కొండూరులోని VKC ఫుట్వేర్ కంపెనీలో సుమారు 120 మంది మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా ‘శక్తి’ యాప్ వినియోగం, లైంగిక వేధింపులు (Sexual Harassment), గృహ హింస (Domestic Violence), సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, OTP మోసాలు మరియు ఇతర సైబర్ నేరాల గురించి వివరించారు.
  • అలాగే మహిళలు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో డైల్ 112 నెంబర్లను వినియోగించాలని సూచించారు.
  • ఈ కార్యక్రమాలలో శ్రీహరికోట మరియు తడా పోలీస్ స్టేషన్లకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు.
  • ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, నేరాల నివారణలో భాగస్వామ్యంగా ఉండాల్సిన అవసరాన్ని పోలీస్ అధికారులు వివరించారు.

Tags:Awareness for Female Employees