పుంగనూరుముచ్చట్లు:
ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోపిశెట్టిపల్లెకి చెందిన వెంకటప్ప కుమారుడు ఎ.విశ్వనాథం(41) తాపిమేగా పనులు చేసుకుంటు ఉండేవాడు. ఈ క్రమంలో తన పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో పట్టణంలోని మార్కెట్ యార్డుకు వచ్చి తిరుగు ప్రయాణంలో వీరభద్రగ్యాస్ సమీపంలోనికి రాగా పుంగనూరు నుంచి నంజంపేటకు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విశ్వనాథం అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Man dies in road accident.