పీలేరు ముచ్చట్లు:
పీలేరు–చిత్తూరు జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో పీలేరు ఆర్‌బీఐ కాలనీకి చెందిన బాలరాజు కుమారుడు సింహాద్రి (18) తీవ్రంగా గాయపడి, 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే కాలనీకి చెందిన శరత్ నాయక్ తీవ్రంగా గాయపడగా తిరుపతిలోని NVVR ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ సాయి (27) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Tourist bus and auto-rickshaw collide; young man dies.