పుంగనూరు ముచ్చట్లు:
ఓ న్యాయవాది పట్ల కోర్టుకు హాజరైన నిందితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదు చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో న్యాయవాదిగా ఉన్న గాయిత్రి ని మండలంలోని కుమ్మరగుంటకు చెందిన శ్రీరాములు కోర్టుకు వాయిదా నిమిత్తం హాజరైయ్యాడు. ఈ క్రమంలో శ్రీరాములు మధ్యం మత్తులో న్యాయవాధిని దూషించాడని ఆమె తెలపగా న్యాయమూర్తి పోలీసులకు శ్రీరాములపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో న్యాయవాది గాయిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
Tags: Case registered for indecent behavior towards a lawyer.