July 27, 2026
Explore
ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో మృతి

ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో మృతి

July 27, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో మృతి చెందడంతో రాజంపేట పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజంపేటకు చెందిన జనసేన సైనికుడు చింతల శివ (47) సోమవారం తెల్లవారుజామున తిరుపతిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు, రాజంపేట పూర్వవాసి షేక్ ఇస్మాయిల్ (57) ఆదివారం అరసవెల్లి సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ రెండు మరణాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆయా ఘటనలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

Tags: Two people died in separate incidents.