April 27, 2026
Explore
జర్నలిస్టు స్థలాలు కబ్జా చేస్తే సహించం

జర్నలిస్టు స్థలాలు కబ్జా చేస్తే సహించం

April 27, 2026 | Andhra Pradesh

– సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

పుంగనూరు ముచ్చట్లు:


జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించమని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. పుంగనూరు పట్టణంలో ధోబి ఘాట్ వద్ద జర్నలిస్టులకు ఇంటి స్థల ప్లాట్లు ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విలేకర్ల కోట కింద రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయంతో మేలుపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్97/4 లో లేఅవుట్ వేసి పదిమంది విలేకర్లకు 2000 సంవత్సరంలో పట్టాలను అందజేశారు. అప్పటినుండి ఇంటి స్థలాలు వారి స్వాధీన అనుభవం లోని ఉన్నాయన్నారు. కొంతమంది వ్యక్తులు విలేకరుల ఇచ్చిన ఇండ్ల పట్టాల స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పట్టా నెంబర్ల ప్రకారం ఉన్న స్థలాలను వారికి చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరింద్ర నాథ్ శర్మ, రామాంజనేయులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags;We will not tolerate the encroachment of land allotted to journalists.