July 26, 2026
Explore
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: చమర్తి

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: చమర్తి

July 26, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి అధ్యక్షతన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు పాల్గొని మాట్లాడారు.

సోమవారం ( రేపు ) నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Tags: The ‘Intintiki Telugu Desam’ (Telugu Desam at Every Doorstep) program must be made a success: Chamarthi.