July 26, 2026
Explore
లయన్స్ కంటి ఆసుపత్రిలో 19 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు

లయన్స్ కంటి ఆసుపత్రిలో 19 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు

July 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, సుండుపల్లె, వీరబల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది రోగులకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అర్హులైన 19 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 25 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. దాత ఎర్రగొండ గోవర్ధన్‌రెడ్డి సహకారంతో రోగులు, వారి సహాయకులకు అన్నదానం నిర్వహించారు.కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వైవీఆర్ స్వరూప్ గుప్తా, వైద్యులు సురేష్‌బాబు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Free eye surgeries for 19 people at Lions Eye Hospital.