మదనపల్లె ముచ్చట్లు:
ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణంగా విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదాన్ని పొంచి ఉన్నాయి. అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, అంకిశెట్టిపల్లి రహదారికి ఆనుకునే విద్యుత్ లైన్ వెళుతోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే రహదారి పక్కనే విద్యుత్ వైర్లు చేతికి అందే అంత ఎత్తులో వేలాడుతున్నాయి. ఫోలును చుట్టేసి తీగలు కూడా ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ట్రాన్స్ కో లైన్ మాన్ కు ఏడాదిగా అవేమీ కనిపించడం లేదు. దీంతో ఎప్పుడు ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదం జరగకనే సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
Tags: The looming danger of dangling power lines.