▪️ప్రభుత్వ ఆదేశాలు జారీ.
అమరావతిముచ్చట్లు:
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఏప్రిల్ 27న ఈ జయంతిని అధికారిక ఉత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్.ఓడీలు, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చింది. అమరావతి ప్రాంతాన్ని పాలించిన ప్రఖ్యాత వాసిరెడ్డి వంశానికి చెందిన రాజు ఈయన. అమరావతి పట్టణ ప్రభు, చాళుక్య నారాయణ వంటి బిరుదులు ఆయనకున్నాయి. వెంకటాద్రినాయుడు 1761 ఏప్రిల్ 27న అచ్చమాంబ, జగ్గ భూపతి దంప తులకు జన్మించారు. 1783 డిసెంబరు 8న ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఆయన గురించి నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
Tags: Raja Vasireddy Venkatadri Nayudu’s Birth Anniversary Declared a State Festival