రాయచోటి ముచ్చట్లు:
రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనను కాకినాడ కింగ్స్ జట్టు రూ.4 లక్షలకు కొనుగోలు చేసింది.
హరిశంకర్ రెడ్డి 2017-18లో జోనల్ టీ20లో ఆడగా, 2021 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంపికయ్యారు. ఇప్పటివరకు టీ20ల్లో 23 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశారు. అలాగే లిస్ట్-Aలో 15 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు సాధించారు.
Tags: Opportunity in APL for Rayachoti Cricketer — Selected for ₹4 Lakhs