పుంగనూరుముచ్చట్లు:
భారత జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ స్వీయ లెక్కింపుపై కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదివారం 5కె రన్ నిర్వహించారు. ఇన్‌చార్జ్ కమిషనర్ మహేష్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు కలసి మున్సిపాలిటి నుంచి ర్యాలీని అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భారత జనగణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంటిలోని సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జనగణన ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని , ఎవరు నిర్లక్షం చేసిన ఆకుటుంబ సభ్యులు గణాంకాలలో లేకుండ పోతారని , జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీవో జగధీశ్వర్‌రెడ్డి, సచివాలయాల మేనేజర్ రమణారెడ్డి, నరేంద్రరాజు, శ్రీకాంత్, శ్రీరాములు, హారతి తదితరులు పాల్గొన్నారు.

Tags: 5K Run to Promote Census Self-Enumeration