April 26, 2026
Explore
మలేరియ పై అవగాహన ర్యాలీ

మలేరియ పై అవగాహన ర్యాలీ

April 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మలేరియ జ్వరాలను అరికట్టాలని , దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరుతూ డాక్టర్లు కిరణ్మయి, రమ్యకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని తూర్పు మొగసాల అర్భన్‌ హెల్త్ సెంటర్‌ నుంచి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. దోమల వలన సంభవించే మలేరియ జ్వరాలు దరి చేరకుండ జాగ్రత్తలు తీసుకోవాలని , వేడి నీటిని తాగాలని , నీటి నిల్వలు లేకుండ చూడాలని నినాదాలు చేస్తూ , ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు గంగయ్య, సోమశేఖరాచారి, తేజోమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags; Malaria Awareness Rally