April 26, 2026
Explore
సేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం…

సేఫ్ తిరుపతి ప్రధాన లక్ష్యం…

April 26, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఇది మా లక్ష్యం, మన లక్ష్యం మరియు మనందరి లక్ష్యం.
  • సామాన్యమైన ప్రజలకు, భక్తులకు రక్షణ కల్పించడం తో పాటు …అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు…
  • తిరుపతి జిల్లా లోని డామినీడు మరియు తారక రామా నగర్ లలో వేకువ జామున కార్డన్ & సెర్చ్( వజ్ర పహార్) ఆపరేషన్ నిర్వహణ
  • పోలీస్, ఎక్సైజ్, RTA, Eagle, ఆర్మ్డ్ విభాగం, డాగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బంది తో సహా 600 పాల్గొని సమన్వయంతో ఆపరేషన్ నిర్వహణ.
  • డ్రోన్ కెమెరాలలో పర్యవేక్షణ.
  • 38 అనుమానితులతో పాటు 224 మోటార్ సైకిల్ 22 ఆటోలు స్వాధీనం.
  • రెండు చోట్ల ప్రత్యక్షo గా పాల్గొని ప్రజలతో మమేకమై విలువైన సూచనలు ఇచ్చిన జిల్లాఎస్పీ ఎల్ .సుబ్బరాయుడు
  • సంయుక్త ఆపరేషన్ కి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రతి వ్యక్తి యూనిఫాం లేని పోలీస్ లు గా భావించి పోలీస్ శాఖ కి సహకరించాలి.
  • అత్యవసర సమయాల్లో డయల్ 112 కి కాల్ చెయ్యండి. గంజాయి లేదా మాదక ద్రవ్యాల సమాచారం నిమిత్తం 1972 కి కాల్ చెయ్యండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం.
  • చేయి చేయి కలపండి, గంజా మరియ ఇతర డ్రగ్స్ రహిత తిరుపతి ఏర్పాటు లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కండి.
  • ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం సామాన్యమైన వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా ….వారీ మధ్యలో ఉంటూ అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం.
  • ఆపరేషన్ లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది ను అభినందించిన జిల్లా ఎస్పీ .
  • తిరుపతి 26 : ప్రజలకు భద్రత కల్పించడమే ధ్యేయంగా తిరుపతి జిల్లా పోలీసులు దృఢమైన చర్యలతో ముందుకు కొనసాగారు..తెల్లవారుజామున ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసుల విస్తృత తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఇది సాధారణ తనిఖీ కాకుండా, నేరాలను అరికట్టే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కార్డన్ అండ్ సెర్చ్ వజ్రప్రహార్ ఆపరేషన్ లొ భాగంగా నిర్వహించారు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయుటకు పోలీసులు ఏకకాలంలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిరుపతి, తిరుచానూరు, దామినేడు, రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తారకరామ నగర్ తదితర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
  • తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ప్రాంతంలో ఉదయం 4 గంటల నుండి సుమారు 3000 గృహాలలో నివసిస్తున్న 8000 మంది వివరాలను సేకరించారు. సరైన పత్రాలు లేని 55 వాహనాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి గత నేర చరిత్రను పరిశీలిస్తున్నారు.
  • అలాగే రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తారకరామ నగర్ ప్రాంతంలో సుమారు 10,000 గృహాలలో 20,000 మంది నివసిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ 169 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి రికార్డులను పరిశీలిస్తున్నారు. 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
  • ఈ ఆపరేషన్‌లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, అనాథ వాహనాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించడంతో పాటు అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు సేకరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి, అనుమానితులపై విచారణ చేపడుతున్నారు.
  • ప్రజలతో మమేకమైన పోలీసులు ఇది కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నంగా కొనసాగింది. కాలనీల్లో నివసిస్తున్న ప్రజలతో పోలీసులు మాట్లాడి, కొత్త వ్యక్తులు వచ్చినపుడు వెంటనే సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. చట్టం అందరికీ సమానమనే సందేశాన్ని బలంగా చాటారు.
  • ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుపతి పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి జీవనం సాగిస్తున్న వారి మధ్య దాగి నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రైమ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
  • ప్రతి పోలీస్ అధికారి తమ పరిధిలో అవసరమైన చోట వెంటనే ఆపరేషన్లు నిర్వహించాలని, అనుమానాస్పద ప్రాంతాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవాలని సూచించారు. నేరస్థులు ఎక్కడా తప్పించుకోలేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే, తప్పు చేయని ప్రజలకు భద్రతా భావం కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి, వారి సహకారంతో కీలక సమాచారాన్ని సేకరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. నైట్ ఆపరేషన్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, వాటిని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు.
  • “గాంజా నిర్మూలన, రౌడీయిజం అరికట్టడం, ఇతర నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ తరహా ఆపరేషన్లు నిరంతరం కొనసాగిస్తాము. తిరుపతిని సురక్షిత నగరంగా మార్చడం మా ప్రధాన లక్ష్యం. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా ఈగల్ టీమ్‌కు సమాచారం అందించాలి. అందించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటాము” అని తెలిపారు.
  • ఈ ఆపరేషన్‌లో పోలీస్ శాఖతో పాటు ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఈగల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
  • ప్రజలు చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. విధుల్లో ఉత్తమంగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.

Tags: The primary objective of Safe Tirupati…