మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లి మండలం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. చీకులపల్లి సమీపంలోని సుబ్బిరెడ్డిబావిలో సహచరులతో కలిసి ఓ యువకుడు ఈత ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. సహచరులు కేకలు పెట్టడంతో, స్థానికులు స్పందించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నిస్తూ ఉండగా అతను మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది.


Tags: Young Man Drowns While Swimming