April 26, 2026
Explore
మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ కోసం ముమ్మరంగా స్థల పరిశీలన…

మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ కోసం ముమ్మరంగా స్థల పరిశీలన…

April 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలో అత్యాధునిక వసతులతో కూడిన నూతన టమాటా మార్కెట్ యార్డ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు, ఈ రోజు సబ్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థలాలను పరిశీలించారు.
నూతన మార్కెట్ యార్డ్ కోసం సుమారు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మూడు ప్రధాన ప్రాంతాలను పరిశీలించారు..
1.బైపాస్ రోడ్డులో పి.పి.ఆర్ కళ్యాణ మండపానికి ఎదురుగా ఉన్న సుమారు 30 నుండి 40 ఎకరాల స్థలం.

  1. శాంటోరియం సమీపంలోని మెడికల్ కాలేజీకి దక్షిణ భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న డి.కె.టి సాగు భూములు.
    3.పోతుబోలు రోడ్డులో అందుబాటులో ఉన్న సుమారు 40 ఎకరాల స్థలం.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ , సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి , మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామ్ ,
మార్కెట్ యార్డ్ సెక్రటరీ జగదీష్, డైరెక్టర్ లక్ష్మీపతి, మండల సర్వేయర్ చక్రపాణి, సర్వేయర్ సుబ్రహ్మణ్యం , వి.ఆర్.ఓ నారాయణ, వి.ఆర్.ఓ నాగరాజు, మరియు డి.టిలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మదనపల్లి టమాటా మార్కెట్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, రైతులకు మరియు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పరిశీలన నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Tags: Intensive site inspection underway for a new tomato market yard in Madanapalle.