విశాఖపట్నం ముచ్చట్లు:
ఏపీలోని విశాఖపట్నం ఐటీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న మెగా ఏఐ హబ్, డేటా సెంటర్ కు ఈ నెల 28వ తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఆసియా ఖండానికే ఏఐ గేట్వేగా విశాఖ మారనుంది. ఈ కార్య క్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ హాజరవుతున్నారు.
Tags: Groundbreaking ceremony for the Google Mega Hub in Visakhapatnam on the 28th of this month.