బి.కొత్తకోట ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణనలో భాగంగా స్వీయ జనగణనపై అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం నగర పంచాయతీ కమిషనర్ బి.రమాదేవి ఆధ్వర్యంలో 5 కే రన్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా, పిటీఎం రోడ్డు, బాలుర జడ్పీ హైస్కూల్ వరకు ఈ రన్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఈనెల 30 వరకు ప్రతి పౌరుడు తన కుటుంబ వివరాలను యాప్ లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ వివరాలను తిరిగి ఇంటింటికి వచ్చే జన గణకులు పరిశీలించి అవసరమైతే వాటిలో చేర్పులు, మార్పులతో షరి చేస్తారని తెలిపారు. దీనిపై ప్రజలందరూ అవగాహన పెంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Tags: Public Awareness on Self-Enumeration