April 26, 2026
Explore
పారిశుద్ధ్య పనులపై జేసీ ఆకస్మిక తనిఖీలు

పారిశుద్ధ్య పనులపై జేసీ ఆకస్మిక తనిఖీలు

April 26, 2026 | Andhra Pradesh

-గైర్హాజరుపై చర్యలు ఉంటాయని హెచ్చరిక

మదనపల్లె ముచ్చట్లు:

జిల్లా జాయింట్ కలెక్టర్, మదనపల్లె మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శివ నారాయణ శర్మ ఆదివారం తెల్లవారుజాము ఐదు గంటల నుంచి పట్టణంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బుగ్గ కాల్వ, ముగ్గురాళ్ల వంక, ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం పరిసరాలు, ఇందిరా నగర్, రామారావు కాలనీ ప్రాంతాల్లో పెరుగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఎంతమంది వర్కర్లు విధుల్లో ఉన్నారు, వారు ఏ విధంగా చెత్తను సేకరిస్తున్నారు, రహదారులు శుభ్రం చేస్తున్నారా లేదా, కాలువల్లో పేరుకుపోయిన మురుగు చెత్తను పూర్తిగా తొలగిస్తున్నారా లేదా వంటి అంశాలను పరిశీలించారు. కాలువల నుంచి తీసిన మట్టిని, చెత్తను రహదారులపై ఉంచకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుల సమస్యలపై అవసరాలను ఆరా తీశారు. పారిశుద్ధ్య పనులకు ఎవరైనా హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీకి సహకరించాలన్నారు.

Tags: Joint Collector Conducts Surprise Inspections of Sanitation Works