మదనపల్లె ముచ్చట్లు:
సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఇప్పటిదాకా
అందజేసిన అర్జీలపై సమాచారం కోసం మీకోసం కాల్ సెంటర్ నెంబర్ 1100కు సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. అర్జీదారులు కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా మీకోసం పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చని, వారి అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు వినతులు ఇవ్వవచ్చని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేయాలని కోరారు.
Tags: PGRS at the Collectorate on the 27th.