మదనపల్లె ముచ్చట్లు:
జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిస్కం ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. 9440817449 నెంబర్ కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: Receiving Complaints Regarding Power Issues