మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి సోదరి జింకా నిర్మల శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం మదనపల్లె చేరుకుని జింకా నిర్మల మృతదేహానికి నివాళులర్పించారు. జింకా చలపతిని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి, పుంగనూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర నాయకులు బాబ్జాన్, సిపి.సుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు జనసేన రాయలసీమ కన్వీనర్ రాందాస్ చౌదరి తదితరులు నిర్మల మృతదేహానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
Tags: Former Minister Pays Tribute to Nirmala