బి.కొత్తకోట ముచ్చట్లు:
బి. కొత్తకోటలో విద్యార్థి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో టోర్నీ విజేతగా మైటీ లెవెన్స్ నిలిచింది. ఆదివారం టోర్నీ విజేతలైన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరుకున్న రెండు జట్ల మధ్య ఆదివారం పోటీ హోరాహోరీగా జరిగింది. ఈ పోటీలో మైటీ లెవెల్స్ విజేతగా, జ్యోతి 11 రన్నర్స్ గా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన ఏపీఎం హరినాథ్ విజెతల్లో మొదటి బహుమతి రూ.30 వేలు, రెండవ బహుమతి రూ.20వేలు, మూడవ బహుమతి రూ.20వేలు అందించారు. టోర్నమెంట్ లో బాగా రాణించిన ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సయ్యద్, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ గా వినోద్ కు బహుమతి అందించారు. ప్రోత్సాహక బహుమతి సునీల్ లెవెల్స్ కి అందజేశారు. క్రీడాకారులు సురేష్ భావజన్, ఫయాజ్ పాల్గొన్నారు.
Tags:Cricket Tournament Winner: Mighty Elevens