April 26, 2026
Explore
ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా కదిరి పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహణ….

ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా కదిరి పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహణ….

April 26, 2026 | Andhra Pradesh

కదిరి ముచ్చట్లు:

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల తో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు చేపడుతున్న ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం కదిరి డీఎస్పీ శివ నారాయణస్వామి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది కలిసి కదిరి పట్టణ పరిధిలోని యర్రగుంటపల్లి, కుమ్మరోళ్లపల్లి మరియు పరిసర ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు విక్రయాలు, మట్కా నిర్వహణ, రౌడీ షీటర్ల కదలికలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 వాహనాలను తనిఖీ చేయగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.
ప్రజల భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Tags: Cordon and search operation conducted in Kadiri town as part of ‘Operation Vajra Prahar’.