April 26, 2026
Explore
27న పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల

27న పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల

April 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 92% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశాల కోసం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 5న వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.

Tags: POLYCET Preliminary Key Released on the 27th