April 26, 2026
Explore
మంగంపేటలో రోడ్డు ప్రమాదం.. జనసేన నాయకుడి మృతి

మంగంపేటలో రోడ్డు ప్రమాదం.. జనసేన నాయకుడి మృతి

April 26, 2026 | Andhra Pradesh

ఓబులవారిపల్లి ముచ్చట్లు:

ఓబులవారిపల్లి మండలం మంగంపేట పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జనసేన నాయకుడు మంగారపు నరసింహులు (50) మృతి చెందారు.

తన మిల్లుకు వెళ్లి తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Road Accident in Mangampeta: Janasena Leader Dies