మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నీరుగట్టువారిపల్లెకు చెందిన దివ్య నారాయణ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైంది. ఎలుకల మందు తాగి ఇంట్లో చెప్పకుండా ఉండిపోవడంతో కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం కోసం మదనపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చారు.
Tags: Student commits suicide after failing