April 26, 2026
Explore
టోల్ గేట్ సిబ్బందిపై దాడి ఆరోపణలు.. ఎమ్మెల్యే అనుచరుల హంగామా

టోల్ గేట్ సిబ్బందిపై దాడి ఆరోపణలు.. ఎమ్మెల్యే అనుచరుల హంగామా

April 26, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురం ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ సిబ్బందిపై దాడి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన అనుచరులు టోల్ వద్ద వాహనం ఆపిన విషయంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో మహిళా సిబ్బంది శ్రీలత, మేనేజర్ రవితో పాటు ఇతరులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మహిళలు అని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని, మేనేజర్ రవిని కొట్టి కారులో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశముంది.

Tags; Allegations of Attack on Toll Gate Staff: MLA’s Followers Create Ruckus