పుంగనూరుముచ్చట్లు:
మలేరియా వ్యాధిని మనం అందరం కలసి అంతం చేయాలని నినాదాలు చేస్తూ డాక్టర్లు కిరణ్మయి, రమ్యకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తూర్పువెహోగసాల అర్భన్ హెల్త్ సెంటర్ నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు మాట్లాడుతూ దోమల వలన సంభవించే మలేరియా జ్వరానికి ముందు చలి, జ్వరం వస్తుందన్నారు. ఆ సమయంలో ప్రజలు నిర్లక్షం చేయకుండ చికిత్సలు చేసుకోవాలన్నారు. ఇంటి వద్ద నీటి నిల్వలు లేకుండ పారిశుద్ద్య కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు గంగయ్య, సోమశేఖరాచారి, తేజోమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Tags; Let’s end malaria.