సుండుపల్లి ముచ్చట్లు:
సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రాయవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవం నిర్వహిస్తారని, మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. చలి, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్ష చేయించుకుని పూర్తిగా మందులు వాడితే నయం అవుతుందని సూచించారు.
ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమతెరలు వినియోగించాలని, వేపాకు పొగ వాడాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీహెచ్వో వీరనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ సుగుణమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శీను నాయక్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Tags: Malaria Must Be Prevented: Awareness Rally Organized