అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు, అధికారులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ నిషాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై కఠిన నిఘా కొనసాగుతోంది.
జిల్లాలో ‘వజ్రప్రహార్’, ‘సేఫ్ జోన్ క్యాంపస్’, ‘గరుడ’ ఆపరేషన్ల ద్వారా గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కార్డన్ సెర్చ్‌లలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
Tags: ‘Vajra Prahar’ Against Drugs… ‘Safe Zone Campus’ for the Youth