April 25, 2026
Explore
రహదారి భద్రతకు పోలీస్ ‘కవచం’.. ప్రమాదాల తగ్గుదల

రహదారి భద్రతకు పోలీస్ ‘కవచం’.. ప్రమాదాల తగ్గుదల

April 25, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. గతేడాది 238 మరణాలు నమోదు కాగా, ఈ ఏడాది 173కు తగ్గాయి. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద వాహనాల ప్రదర్శన, ‘స్టాప్, వాష్ & గో’ వంటి కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు.

ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణాలకు రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాను ప్రమాదరహితంగా మార్చేందుకు పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి.

Tags: Police ‘Shield’ for Road Safety: Decline in Accidents