April 25, 2026
Explore
ఈవీఎం గోదాం తనిఖీ.. పటిష్ట నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశం

ఈవీఎం గోదాం తనిఖీ.. పటిష్ట నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశం

April 25, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

రాయచోటిలో ఈవీఎంల భద్రతపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన బీయూలు, సీయూలు, వివిప్యాట్ యంత్రాలను, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోదాం వద్ద 24 గంటలపాటు పటిష్ట నిఘా కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. తనిఖీ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు.

Tags: Inspection of EVM Warehouse: Collector Orders Continued Strict Surveillance