April 25, 2026
Explore
రౌడీలకు హెచ్చరిక.. పలు కేసుల్లో నలుగురు అరెస్ట్

రౌడీలకు హెచ్చరిక.. పలు కేసుల్లో నలుగురు అరెస్ట్

April 25, 2026 | Andhra Pradesh

ఒంటిమిట్ట ముచ్చట్లు:

రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి తస్మాత్ జాగ్రత్త అని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హెచ్చరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ పరిధిలో పలు కేసుల్లో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఒంటిమిట్టకు చెందిన ఈరి హర్షవర్ధన్‌పై కులం పేరుతో దూషించి గాయపరిచిన కేసులో కట్టా మల్లికార్జున, కట్టా బాలకృష్ణ, పూల కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

అలాగే నందలూరు మండలం గట్టుమీదపల్లిలో బెల్లం కొండయ్యను రాయితో కొట్టి హత్య చేసిన కేసులో చిన్నయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి, ఒంటిమిట్ట ఎస్సై శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:Warning to Rowdies: Four Arrested in Several Cases