April 25, 2026
Explore
భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష.

భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష.

April 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • భారత ఉపరాష్ట్రపతి సీపీ. రాధాకృష్ణన్ తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ASL సమావేశం నిర్వహణ.
  • జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., ఆధ్వర్యంలో భద్రత, మరియు ఇతర ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష.
  • తిరుపతి జిల్లాకు భారత ఉపరాష్ట్రపతి సీపీ. రాధాకృష్ణన్ 27 మరియు 28 తేదీలలో తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో భద్రత మరియు పరిపాలనా ఏర్పాట్లపై అధికారులు ముందస్తు సమీక్ష నిర్వహించారు.
  • ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వద్ద ASL (Advance Security Liaison) సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జి. నరసింహులు ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
  • పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు, అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి పర్యటన విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
  • అనంతరం ఎయిర్పోర్ట్ నుండి తిరుచానూరు, తిరుమల వరకు ఏఎస్ఎల్ నిర్వహించి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
  • జిల్లా ఎస్పీ ప్రతి అంశాన్ని సమగ్రంగా సమీక్షించి, ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Tags:Comprehensive review of security arrangements with officials.