తిరుపతి ముచ్చట్లు:
- శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.
- జూనియర్ కాలేజీలలొ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన.
- మహిళలపై నేరాలు, డ్రగ్స్, సైబర్ మోసాలపై ప్రచారం.
- అంగన్‌వాడీ టీచర్లతో కలిసి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహణ
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, మహిళల భద్రత మరియు సమాజంలో అవగాహన పెంపొందించేందుకు శక్తి టీమ్ పోలీసులు మరియు పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
- ఈరోజు శక్తి టీమ్ పోలీసులు తిరుచానూరు లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ, చదువు ప్రాముఖ్యత, మంచి స్నేహితుల ఎంపిక, ఆరోగ్యం మరియు పోషణ వంటి అంశాలపై విద్యార్థులకు సూచనలు అందించారు. టీనేజ్ వయస్సులో ఎదురయ్యే ఆకర్షణలను నియంత్రించకపోతే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఉదాహరణలతో వివరించారు. అలాగే చదువు ద్వారా వ్యక్తిగత స్థాయిని ఎలా పెంపొందించుకోవాలో, తల్లిదండ్రులకు భారంగా మారకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
- ఇకపోతే, సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితరాల్లో జరుగుతున్న మోసాలు, డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్‌ల ద్వారా జరిగే నేరాలు, AI టెక్నాలజీ వాడకంలో జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, డ్రగ్స్, ట్రాఫిక్ నిబంధనలు, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక నేరాల నివారణపై కూడా వివరించారు. శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన 1930, 112, 1972 టోల్ ఫ్రీ నంబర్ల గురించి తెలియజేశారు.
- అలాగే నారాయణవనం ప్రాంతంలో మహిళలపై నేరాలు, డ్రగ్స్ మరియు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు నేరాల నివారణలో జాగ్రత్తలు, పోలీసులకు సమాచారం అందించాల్సిన అవసరం గురించి వివరించారు.
- ఇక మండల స్థాయిలో అంగన్‌వాడీ టీచర్లతో కలిసి మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్‌లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ స్థాయిలో ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Tags: Awareness on Women’s Safety and Cyber Crimes under the Aegis of the Shakti Team