April 25, 2026
Explore
కర్నూలులో 66 పెట్రోల్‌ బంకులు మూత యంత్రాంగం

కర్నూలులో 66 పెట్రోల్‌ బంకులు మూత యంత్రాంగం

April 25, 2026 | Andhra Pradesh

  • కర్నూలు ముచ్చట్లు:
  • పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా విషయంలో సమస్య తలెత్తింది. ఆయిల్‌ కంపెనీల నుంచి పెట్రోల్‌ బంకులకు సరఫరాలో కోతలు విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంక్‌ యజమానుల్లో ఆందోళన నెలకొంది. సరఫరా తగ్గిపోవడంతో డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో మొత్తం 166 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అందులో హెచ్‌పి 58, ఐఒసిఎల్‌ 52, బిపిసిఎల్‌ 30, ప్రయివేట్‌ నయారా 22, జియో కంపెనీవి నాలుగు ఉన్నాయి. జిల్లాలో శుక్రవారం నాటికి 66కు పైగా పెట్రోల్‌ బంకులు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో తెల్లవారుజాము నుంచే వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. లీటర్‌ పెట్రోల్‌ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. పెట్రోల్‌ బంక్‌ వద్ద స్టాక్‌ లేదని చెప్పడంతో, వాహనదారులు ఆశగా మరో బంక్‌ వైపు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి పరిమితంగానే సరఫరా చేస్తున్నామని చెప్పడంతో వాహనదారులు నిరాశకు గురవుతున్నారు. ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లిస్తేనే పెట్రోల్‌ సరఫరా చేస్తామని కంపెనీలు చెబుతున్నట్లు సమాచారం.

Tags: 66 Petrol Bunks Shut Down in Kurnool: Authorities Take Action