తాడేపల్లి భరతమాత సెంటర్‌లో ప్రమాదం
క్షేమంగా బయటపడ్డ వ్యక్తి
తాడేపల్లి ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని భరతమాత సెంటర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటన ఈరోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు (ఎయిర్ బెలూన్లు) వెంటనే తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. కాగా, సదరు కారు పోలీస్ శాఖకు చెందినదిగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తి కిందకు దిగి, తన సెల్‌ఫోన్ మరియు వాకీటాకీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Car veers out of control and plunges into drainage canal.