April 25, 2026
Explore
పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ

పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ

April 25, 2026 | Andhra Pradesh

▪️మే నెలలో చెల్లించేవారికి వర్తింపు.

అమరావతిముచ్చట్లు:

పుర, నగరపాలక సంస్థల తరహాలో పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ మొదటిసారి ప్రకటించారు. మే 1 నుంచి 31లోపు 2026-27 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లించేవారికి రాయితీ ఇవ్వనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. మే 1 నుంచి స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆస్తి పన్ను చెల్లించొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ విజ్ఞప్తి చేశారు.

Tags: 5% Property Tax Rebate in Panchayats Too