April 25, 2026
Explore
మదనపల్లెలో హొసింగ్ నిర్మిత కేంద్రం కబ్జా

మదనపల్లెలో హొసింగ్ నిర్మిత కేంద్రం కబ్జా

April 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

కబ్జా స్థలంలో యదేచ్చగా అక్రమ షెడ్లు ఇళ్ల నిర్మాణాలు.బసినికొండ సచివాలయంకు ఆనుకునే నిర్మిత కేంద్రాన్ని యదేచ్చగా కబ్జా చేస్తున్నా కళ్ళు మూసుకుని ఉన్న రెవెన్యూ అధికారులు .అన్నమయ్య జిల్లా, మదనపల్లె బసినికొండలో హౌసింగ్ అధికారులకు ప్రభుత్వం కేటాయించిన నిర్మిత కేంద్రాన్ని స్థానికులు ఆక్రమించారు. ఆక్రమిత స్థలాల్లో అక్రమంగా ఇల్లు, షెడ్లు నిర్మించి నిర్మిత కేంద్రాన్ని యదేచ్ఛగా కబ్జా చేశారు. ఇన్నాళ్లు ప్రభుత్వ స్థలాలనే కబ్జా చేస్తున్న కొందరు కబ్జారాయుళ్ల ఇప్పుడు ఏకంగా హౌసింగ్ స్థలాన్ని కూడా వదలడం లేదు. మదనపల్లెను జిల్లాగా ప్రకటించినప్పటి నుంచి కొందరు నాయకుల పేరు చెప్పుకుని కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్ స్పందిస్తారో లేదో వేచి చూడాల్చి ఉంది.

Tags: Housing Center in Madanapalle Encroached Upon