April 25, 2026
Explore
విజయ్ కు 25 శాతం ఓట్లు-చీలికతో వాళ్లకే లాభం-తేల్చేసిన అనలిస్ట్..!

విజయ్ కు 25 శాతం ఓట్లు-చీలికతో వాళ్లకే లాభం-తేల్చేసిన అనలిస్ట్..!

April 25, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటర్లు తమ తీర్పు చెప్పేశారు. దీంతో వారి తీర్పు ఆధారంగా విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన రాజకీయ విశ్లేషకుడు వెంకట్రామన్ నిన్న ఎన్నికల్లో ఏం జరిగిందో, దాని ఆధారంగా ఏం జరగబోతోందో కూడా చెప్పేశారు. ఆయన అంచనా ప్రకారం అధికారంలోకి వచ్చే పార్టీపై స్పష్టత వచ్చినా రెండో స్ధానంపై మాత్రం స్పష్టత లేదని ఆయన తేల్చేశారు.
తమిళనాడులో అనూహ్య ఫలితాలు

తమిళనాడు శాసనసభ ఎన్నికలు ముందంజలో ఉన్న పార్టీ విషయంలో స్పష్టత ఉన్నా, ఎన్నికల ప్రభావం, రెండో స్థానం విషయానికి వస్తే పూర్తిగా అనూహ్యంగా ఉన్నాయని “ద ఫెడరల్” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ విశ్లేషకుడు వెంకట్రామన్ అభిప్రాయపడ్డారు. నటుడు విజయ్ (Vijay) స్థాపించిన టీవీకే (TVK) ప్రవేశం సాంప్రదాయక ఓటింగ్ సరళిని, ముఖ్యంగా యువ ఓటర్లలో గణనీయంగా మార్చేసిందన్నారు. టీవీకే రాకతో ఈ ఎన్నికలు అసాధారణంగా మారాయన్నారు. యువత పెద్దసంఖ్యలో పాల్గొనడానికి టీవీకేనే ప్రధాన కారణం కావచ్చని, ఇది తమిళనాడుకు మంచి పరిణామమని వెంకట్రామన్ వివరించారు.

Tags: Vijay Secures 25% of Votes—Split Benefits Them—Analyst Concludes!