April 25, 2026
Explore
కుక్కల దాడిలో 40 గొర్రెల మృతి.

కుక్కల దాడిలో 40 గొర్రెల మృతి.

April 25, 2026 | Andhra Pradesh

– రైతుకు భారీ నష్టం

రామసముద్రం ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.

Tags: 40 sheep killed in dog attack.