April 25, 2026
Explore
ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష

ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష

April 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 2వ ఏడీజే కోర్టు జడ్జి సూర్యనారాయణ ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

2018లో గుట్టవారిపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ నిర్మాణ సమయంలో ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడిపి బోల్తా పడేలా చేసిన ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది.

Tags: Driver who caused the deaths of two sentenced to three years in prison