మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండలంలో రైతుపై తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) పొలంలో కూరగాయ పంటలకు నీరు మళ్లిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.
తీవ్ర గాయాలపాలైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
Tags: Honeybee Attack on Farmer; Condition Critical