రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో మున్సిపల్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే సహించబోమని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షమీమ్ భాషా హెచ్చరించారు.
తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ, ట్రేడ్ లైసెన్సులను పరిశీలించడంతో పాటు, నిషేధిత ప్లాస్టిక్ వినియోగం, అపరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లు, బేకరీల నుంచి ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని సుమారు రూ.11,000 జరిమానాలు విధించారు. ఆహార పదార్థాలను శుభ్రతతో, నాణ్యత తో అందించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
Tags: Strict Action Inevitable If Food Quality Is Compromised: Commissioner Warns